నటి కీర్తి సురేశ్ ప్రధాన పాత్రలో చాలా కాలంగా ఓ సినిమా తెరకెక్కుతోంది. ఈ చిత్రానికి ‘మిస్ ఇండియా’ అనే టైటిల్‌ను ఖరారు చేశారు. సినిమాకు సంబంధించిన టైటిల్ టీజర్‌ను చిత్రబృందం విడుదల చేసింది. ‘మహానటి’తో చిత్రపరిశ్రమలో స్టార్ హీరోయిన్ అయిపోయారు కీర్తి సురేశ్. ఈ సినిమా ఆమెకు జాతీయ అవార్డును తెచ్చిపెట్టింది. ఈ సినిమాతో మహిళా నేపథ్యంతో తెరకెక్కే సినిమాలకు కీర్తి సరిగ్గా సరిపోతారన్న నమ్మకం దర్శక , నిర్మాతల్లోనూ ఏర్పడింది. ఇప్పుడు ఆమె ‘మిస్ ఇండియా’ అనే లేడీ ఓరియెంటెడ్ సినిమాలో నటిస్తున్నారు. నరేంద్రనాథ్ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రానికి సంబంధించిన టైటిల్ టీజర్ విడుదలైంది. టీజర్‌లో కీర్తి చాలా అందంగా, స్టైలిష్‌గా కనిపిస్తున్నారు. ‘మహానటి’ తర్వాత కీర్తి నటిస్తున్న సోలో చిత్రమిది. ఈస్ట్ కోస్ట్ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై మహేశ్ కోనేరు నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. తమన్ సినిమాకు సంగీతం అందిస్తున్నారు. త్వరలో సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు.
from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/30yfQ96
v
No comments:
Post a Comment