Monday, 26 August 2019

Ileana Breakup ఇలియానా లవ్ బ్రేకప్.. రీజన్ అదేనా?

గోవా బ్యూటీ తన బాయ్ ఫ్రెండ్ ఆండ్రూ నీబోన్‌తో విడిపోయిందా? అవుననే అంటున్నాయి బాలీవుడ్ వర్గాలు. ఆస్ట్రేలియాకు చెందిన ప్రముఖ ఫొటోగ్రాఫర్ ఆండ్రూతో ఇలియానా చాలా కాలంగా ప్రేమలో ఉన్నారు. వీరిద్దరికీ వివాహం కూడా జరిగిపోయిందని ఒకప్పుడు వార్తలు వచ్చాయి. అతను తన జీవితంలోకి రావడంతోనే డిప్రెషన్ నుంచి కోలుకున్నానని చెప్పిన ఈ భామ.. ఇప్పుడు అతనితో బ్రేకప్ అయిపోయిందట. ఇలియానా, ఆండ్రూ సోషల్ మీడియాలో ఒకర్నొకరు అన్‌ఫాలో అయ్యారు. దాంతో ఇద్దరి మధ్య మనస్పర్ధలు వచ్చి విడిపోయుంటారని బీటౌన్‌లో చర్చ మొదలైంది. చాలా కాలం తర్వాత ఇలియానా ‘అమర్ అక్బర్ ఆంటోనీ’సినిమాతో తెలుగు ప్రేక్షకుల ముందుకు వచ్చారు. అప్పటికే ఆమె చాలా లావైపోయారు. దాంతో ఆమె గర్భం దాల్చారని వార్తలు కూడా వచ్చాయి. దీనిపై ఆమె తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. ఒకరి వ్యక్తిగత జీవితానికి సంబంధించిన విషయాల గురించి అలా ఎలా రాస్తారని ఆగ్రహం వ్యక్తం చేశారు. తన ప్రేమ, పెళ్లి జీవితానికి సంబంధించి అన్నీ గోప్యంగా ఉంచాలనుకుంటున్నానని అన్నారు. ఆండ్రూతో ప్రేమ తన కెరీర్‌పై ప్రభావం చూపుతుందన్న భయంతో ఇలియానా బ్రేకప్ అయివుంటారన్న సందేహాలు కూడా వ్యక్తం అవుతున్నాయి. అసలు వీరిద్దరి మధ్య ఏం జరిగిందో తెలియాలంటే ఇలియానా స్పందించాల్సిందే. ప్రస్తుతం ఇలియానా ‘పాగల్‌పంతి’ సినిమాతో బిజీగా ఉంది. అనీజ్ బాజ్మీ ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు. నవంబర్ 8న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/2ZhYhxn
v

No comments:

Post a Comment

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...