Monday, 12 August 2019

హీరో ఓవర్.. విలన్ అవతారమెత్తిన నిర్మాత తనయుడు

తెలుగు, తమిళ సినీ పరిశ్రమలకు చెందిన చాలా మంది నిర్మాతల తనయులు హీరోలుగా పరిచయమయ్యారు. తెలుగులో నిర్మాత డి.రామానాయుడు తనయుడు వెంకటేష్ మొదలుకొని బెల్లంకొండ సురేష్ తనయుడు శ్రీనివాస్ వరకు ఎంతో మంది హీరోలుగా పరిచయమయ్యారు. వీరిలో కొంత మంది స్టార్ హీరో హోదాలు సంపాదించుకోగా.. మరికొందరు ఫర్వాలేదనిపించారు. ఇంకొందరు రెండు, మూడు సినిమాల తరవాత కనుమరుగైపోయారు. ఒకప్పుడు తెలుగులో ‘‘సుస్వాగతం, సూర్యవంశం, రాజా, నువ్వు వస్తావని, ప్రియమైన నీకు, సింహరాశి’’ వంటి సూపర్ హిట్ చిత్రాలను నిర్మించిన సూపర్ గుడ్ ఫిలింస్ అధినేత ఆర్.బి.చౌదరి తనయులు కూడా హీరోలుగా పరిచయమయ్యారు. పెద్ద కుమారుడు జీవా తెలుగు ప్రేక్షకులకు సుపరిచితులే. చిన్న కొడుకు రమేష్ సైతం తెలుగు చిత్రంతోనే వెండితెర ఆరంగేట్రం చేశారు. ‘విద్యార్థి’ సినిమా ద్వారా హీరోగా పరిచయమయ్యారు. అయితే, జీవా స్థాయిలో ఆకట్టుకోలేకపోయారు. తమిళంలో ‘జితన్’ సినిమాతో మంచి పేరు సంపాదించిన రమేష్.. ‘జితన్’ను ఇంటిపేరు చేసేసుకున్నారు. తెలుగులో రమేష్ హీరోగా నటించిన సినిమాలు కేవలం రెండే. ఈ ఏడాది ‘ఒకటే లైఫ్’ సినిమాతో రమేష్ ప్రేక్షకుల ముందుకు వచ్చినా పెద్దగా ఆకట్టులేకపోయారు. అయితే, ఈ హీరో ఇప్పుడు విలన్‌గా మారారు. ‘నిరీక్షణ’ అనే తెలుగు సినిమాలో రమేష్ తొలిసారి మెయిన్ విలన్‌గా నటిస్తున్నారు. సాయిరోనక్‌, ఎనా సహా హీరోహీరోయిన్లుగా టేక్‌ ఓకే క్రియేషన్స్‌ పతాకంపై వంశీకృష్ణ మళ్ళ దర్శకత్వంలో రూపొందుతున్న హై ఓల్టేజ్‌ ఇన్వెస్టిగేటివ్‌ క్రైమ్‌ థ్రిల్లర్‌ ‘నిరీక్షణ’. ఈ చిత్రంలో రమేష్‌ మెయిన్‌ విలన్‌గా నటిస్తున్నారు. ఇంకా శ్రద్ధా దాస్‌, సన స్పెషల్‌ క్యారెక్టర్స్‌లో కనిపిస్తారు. బ్రహ్మాజీ, ప్రభాస్‌ శ్రీను, అజయ్‌ ఘోష్‌, మధుసూదన్‌, వేణు, హర్ష తదితరులు ఇతర పాత్రలు పోషిస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్‌ దశలో ఉంది. ఈ చిత్రానికి ‘మంత్ర’ ఆనంద్ సంగీతం సమకూరుస్తున్నారు. చంద్రబోస్ సాహిత్యం అందిస్తున్నారు.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/303KWW8
v

No comments:

Post a Comment

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...