Monday, 26 August 2019

శ్రీదేవి కూతురికి దక్షణాది సినిమాలు నచ్చవా?

తొలి చిత్రంతోనే స్టార్‌డం సంపాదించుకున్నారు జాన్వి కపూర్. ఆ తర్వాత ఆమె వరుస సినిమాలతో బిజీ అయిపోయారు. అయితే ‘రౌడీ’ విజయ్ దేవరకొండ, దర్శకుడు పూరి జగన్నాథ్ కాంబినేషన్లో ఓ సినిమా రాబోతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాకు ‘ఫైటర్’ అనే టైటిల్‌ను ఖరారు చేశారు. ఈ సినిమాలో కథానాయికగా నటించనున్నట్లు చాలా కాలంగా ప్రచారం జరుగుతోంది. మరోపక్క జాన్వికి దక్షిణాది సినిమాలంటే ఇష్టం లేదని అందకే ఆమె విజయ్ పక్కన నటించడానికి ఒప్పుకోలేదని ప్రచారం జరుగుతోంది. దీనిపై బోనీ కపూర్ స్పందిస్తూ.. ‘మా కుటుంబానికి దక్షిణాది సినిమాలంటే చాలా ఇష్టం. శ్రీదేవి అక్కడ చిరంజీవి, ష్ణవంటి స్టార్ హీరోలతో కలిసి నటించారు. నాకు మహేశ్ బాబుతో మంచి ఫ్రెండ్‌‌షిప్ ఉంది. మంచి సినిమా కథ దొరికితే తెలుగులో నటించడానికి జాన్వి సిద్ధంగా ఉంది. అయితే ఇప్పటివరకు జాన్వికి తెలుగులో ఎలాంటి ఆఫర్ రాలేదు. అంతేకానీ తెలుగులో నటించడం ఇష్టంలేక జాన్వి పెద్ద స్టార్ల సినిమాలకు నో చెప్పిందని వస్తున్న వార్తల్లో వాస్తవం లేదు’ అని వెల్లడించారు.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/2ZoR8qw
v

No comments:

Post a Comment

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...