Sunday, 4 August 2019

ప్రియాంక పిచ్చ హాట్.. శునకాలతో హాలీడేను ఎంజాయ్ చేస్తోన్న బ్యూటీ

బాలీవుడ్ హాట్ బ్యూటీ .. తన మరదలు, నటి సోఫియా టర్నర్‌తో కలిసి మియామిలో హాలీడేను ఎంజాయ్ చేస్తోంది. ఈ హాలీడేలో వారి శునకాలు కూడా భాగమయ్యాయి. పెంపుడు కుక్కలు పోర్కీ, డయానాలతో కలిసి ప్రియాంక, సోఫియా ఉన్న ఫొటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. అలాగే.. ప్రియాంక, సోఫియా బికినీల ఫొటోలు కూడా నెట్టింట్లో చక్కర్లు కొడుతున్నాయి. ముఖ్యంగా స్విమ్ షూట్‌లో ప్రియాంక స్టైల్‌గా నడుచుకుంటూ వస్తోన్న ఫొటోలను ఆమె అభిమానులు ఇన్‌స్టాగ్రామ్‌లో విపరీతంగా షేర్ చేస్తున్నారు. గతేడాది డిసెంబర్‌లో నిక్ జోనస్‌ను పెళ్లాడిన ప్రియాంక.. అప్పటి నుంచి హాలీడే ట్రిప్పులు వేస్తూనే ఉంది. బాలీవుడ్‌తో పాటు హాలీవుడ్‌లోనూ సినిమాలు చేస్తోన్న ప్రియాంక సోషల్ మీడియాలో హాట్ హాట్ ఫొటోలను పోస్ట్ చేసి అభిమానులను పిచ్చెక్కిస్తోంది. ఈమె షేర్ చేసిన ఫొటోలే కాకుండా ఫ్యాన్స్ తమ అకౌంట్ల నుంచి మరిన్ని ఫొటోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తున్నారు. ఇటీవల ఇటలీలో హాలీడేను ఎంజాయ్ చేస్తోన్న ఫొటోలను ప్రియాంక షేర్ చేసింది. అక్కడి నుంచి ఫ్లోరిడాలోని మియామి వచ్చారు. ఇక్కడే ప్రియాంక బర్త్‌డే సెలబ్రేషన్స్ చేసుకున్నారు. కుటుంబ సభ్యులంతా కలిసి ఈ హాలీడేను ఫుల్‌గా ఎంజాయ్ చేస్తున్నారు. ఇదిలా ఉంటే, ప్రియాంక మరదలు సోఫియా పెట్ లవర్ అట. ఆమెకు శునకాలంటే చాలా ఇష్టమట. కొన్ని వారాల క్రితం ఆమె పెంపుడు కుక్క వాల్డో న్యూయార్క్‌లో జరిగిన కార్ యాక్సిడెంట్‌లో మరణించింది. ఈ శునకం గుర్తుగా సోఫియా దంపతులు టాటూలు కూడా వేయించుకున్నారు. ఈ శునకం స్థానంలో మరో శునకాన్ని సోఫియా దత్తత తీసుకున్నారు. ఆ శునకంతో హాలీడేను ఎంజాయ్ చేస్తున్నారు.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/2YGlOqY
v

No comments:

Post a Comment

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...