Tuesday, 27 August 2019

అమ్మకు ప్రేమతో.. దేవిశ్రీ ప్రసాద్ సర్‌ప్రైజ్

దేవిశ్రీ చెప్పే విషెస్ కాస్త విభిన్నంగా ఉంటాయి. ఏదన్నా పండగ వచ్చినా, ఎవరిదైనా పుట్టినరోజు ఉన్నా ఆయన తనదైన శైలిలో శుభాకాంక్షలు చెబుతుంటారు. ఎవరికి విష్ చేసినా ‘హ్యాపీయెస్ట్ మ్యూజికల్ బర్త్‌డే’ అంటూ విష్ చేస్తారు. ఈరోజు దేవిశ్రీ తల్లి శిరోమణి పుట్టినరోజు. ఈ సందర్భంగా తన తల్లికి విష్ చేస్తూ ట్విటర్లో ఓ పోస్ట్ పెట్టారు. ‘హ్యాపీయెస్ట్ మ్యూజికల్ బర్త్‌డే అమ్మా. మా అమ్మ సంతోషంగా ఉండటానికి మీ ఆశీస్సులు కావాలి. లవ్యూ అమ్మా.. ఆమె కోసం నేను ఓ ప్రత్యేకమైన వీడియోను రూపొందించాను. సాయంత్రం విడుదల చేస్తాను. దయచేసి ఆ సర్‌ప్రైజ్ గురించి అమ్మకు చెప్పకండి’ అని పేర్కొన్నారు. తన తల్లితో కలిసి దిగిన ఫొటోలను ఈ సందర్భంగా దేవిశ్రీ అభిమానులతో పంచుకున్నారు. ప్రస్తుతం ఆయన మహేశ్ బాబు నటిస్తున్న ‘సరిలేరు నీకెవ్వరు’, చిరంజీవి 152వ సినిమా, అల్లు అర్జున్ 20వ సినిమా, నితిన్ నటిస్తున్న ‘రంగ్ దే’ సినిమాలకు సంగీతం అందిస్తున్నారు.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/2MFDmxP
v

No comments:

Post a Comment

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...