Monday, 5 August 2019

ఆ డేంజర్ ఉండి కూడా ‘ఎవరు’ హిట్టావ్వాలని కోరుకుంటున్నా: నాని

టాలీవుడ్‌లో ప్రతిభావంతులైన నటుల్లో అడివి శేష్ ఒకరు. కేవలం నటుడిగానే కాకుండా స్క్రిప్ట్ రైటర్‌గా, దర్శకుడిగా కూడా శేష్ సత్తా చాటుతున్నారు. కిందటేడాది ‘క్షణం’, ‘గూఢచారి’ సినిమాలతో హిట్లు అందుకున్న శేష్.. ఇప్పుడు ‘ఎవరు’ అనే సస్పెన్స్ థ్రిల్లర్‌తో వస్తున్నారు. అడివి శేష్, రెజీనా, నవీన్ చంద్ర ప్రధాన పాత్రలు పోషించిన ఈ చిత్రం ద్వారా వెంకట్ రామ్‌జీ దర్శకుడిగా పరిచయమవుతున్నారు. పీవీపీ సినిమా బ్యానర్‌పై పెర్ల్ వి. పొట్లూరి, పరమ్ వి. పొట్లూరి, కావిన్ అన్నె ఈ చిత్రాన్ని నిర్మించారు. ఆగస్టు 15న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు వస్తోంది. విడుదల తేదీ దగ్గరపడుతుండడంతో సినిమాపై అంచనాలను పెంచేందుకు ట్రైలర్‌ను ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చారు. ఈ ట్రైలర్ ఆవిష్కరణ వేడుక సోమవారం హైదరాబాద్‌లో జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన నేచురల్ స్టార్ నాని ట్రైలర్‌ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ చిత్ర యూనిట్‌ను అభినందించారు. ట్రైలర్ చూస్తుంటే సినిమా ఎంత బాగుంటుందో తెలిసిపోతుందన్నారు. కిందటేడాది ‘గూఢచారి’ ట్రైలర్‌ను కూడా తానే ఆవిష్కరించానని, ఆ సినిమా కూడా పెద్ద హిట్టయ్యిందని గుర్తుచేసుకున్నారు. ‘‘ట్రైలర్ చాలా గ్రిప్పింగ్‌గా ఉంది. మొదటిసారి చూసినప్పుడు మనం ఏం చూశాం అనే షాక్‌లో ఉండిపోతాం. రెండోసారి చూసినప్పుడు చప్పట్లు కొడతాం. ఈ టీమ్ మొత్తం నాకు ఒక కుటుంబం లాంటిది. శేష్, రెజీనా, పీవీపీ గారు, రవిగారు, నవీన్ అందరూ చాలా క్లోజ్. గతంలో ‘గూఢచారి’ ట్రైలర్‌ను ఇక్కడే ఆవిష్కరించాం. శేష్ ఫోన్ చేసి అడిగినప్పుడు నేను కూడా ఏదో సెంటిమెంట్‌లా, బాధ్యతలా ఫీలయ్యాను. ‘గూఢచారి’ ఎంత పెద్ద హిట్టయ్యిందో మీ అందరికీ తెలుసు. ఈ సినిమా కూడా పెద్ద హిట్టు అయిపోతే శేష్ ప్రతి ట్రైలర్ నేనే లాంచ్ చేయాల్సి వచ్చే డేంజర్ ఉందని తెలిసి కూడా మనస్ఫూర్తిగా ఈ సినిమా పెద్ద హిట్టవ్వాలని కోరుకుంటున్నాను’’ అని నాని అన్నారు. ట్రైలర్ చూస్తుంటే ఇది ఇంగ్లిష్ సినిమానా లేదంటే తెలుగు సినిమానా అనే కన్‌ఫ్యూజన్ తనకు కలిగిందని నాని చెప్పారు. ప్రతిసారి శేష్ ఇంత మంచి క్వాలిటీతో సినిమాలు ఎలా చేస్తాడో తనకు అర్థం కావడంలేదన్నారు. టీజర్ చూసినప్పుడే సినిమా చాలా ఆసక్తికరంగా ఉంటుందని అనిపించిందని.. ఇప్పుడు ట్రైలర్ చూశాక ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా ఎప్పుడెప్పుడు చూస్తామా అన్నంటుందని నాని వెల్లడించారు. ఈ సినిమా మరో మంచి విజయాన్ని శేష్‌కు అందించాలని కోరుకున్నారు.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/2GJhuN9
v

No comments:

Post a Comment

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...