Monday, 26 August 2019

Anushka Shetty: అనుష్క నేను బీచ్‌లో తిరిగామా? ప్రభాస్ షాకింగ్ రియాక్షన్

‘బాహుబలి’ చిత్రం తరవాత ఇంటర్నేషనల్ స్టార్‌గా మారిన ‘సాహో’ చిత్రంతో ఆగస్టు 30 ప్రేక్షకుల ముందుకురానున్నారు. ఈ మూవీ ప్రమోషన్స్‌లో భాగంగా చిత్ర విశేషాలతో పాటు తన పర్శనల్ విషయాలను షేర్ చేసుకున్నారు. ఈ సందర్భంగా తనకు అనుష్కకు ఉన్న రిలేషన్‌పై వస్తున్న రూమర్స్‌పై క్లారిటీ ఇచ్చారు. ప్రభాస్‌ మాట్లాడుతూ.. ‘వాళ్లకు నేను ఏం చెప్పినా వేస్ట్.. వాళ్లు ఆల్రెడీ ఫిక్స్ అయిపోయారు నాకు అనుష్కకు ఏదో ఉంది అని.. దీనికి ఒకటే పరిష్కారం ఉంది. ఒకటి అనుష్కకి అయినా పెళ్లి కావాలి.. లేదంటే నాకైనా పెళ్లి కావాలి.. లేదంటే ఇది ఆగదు. మొదట్లో ఇది రూమరే కదా అని చాలా లైట్ తీసుకున్నా.. కొన్నిరోజుల్లో పోతుందిలే అని. కాని దీన్ని హైడ్ చేస్తూ వస్తున్నారు. రెండు సంవత్సరాలకు పైగా హైడ్ చేస్తూ వస్తున్నారు. అంత అవసరం ఏమి ఉంది? మళ్లీ చెప్తున్నా.. అనుష్క నేను జస్ట్ ఫ్రెండ్స్ అంతే. ఎక్కడైనా రోడ్ మీద కనిపించి.. బీచ్‌లకు తిరుగుతుంటే ఏదో ఉందని రూమర్ క్రియేట్ చేయొచ్చు. అసలు మేం ఎక్కడా అలా తిరగలేదు. తన పని తాను చేసుకుంటుంది. నేను నా పని చేసుకుంటున్నా. ఇవి ఇంక ఆగవని డిసైడ్ అయిపోయా.. నువ్వన్నా పెళ్లి చేసుకో.. లేక నేనన్నా చేసుకుంటా.. వీళ్లైతే రాయడం ఆపరు అని అనుష్కతో చెప్పా. అయితే మేం ఇద్దరం అప్పుడు ఇప్పుడు మంచి స్నేహితులం. ఏవో రూమర్స్ వస్తున్నాయి కదా అని ఫ్రెండ్ షిప్‌ని ఎందుకు బ్రేక్ చేయాలి. మేం ఇద్దరం కలిసినప్పుడు వీటిని చూసి నవ్వుకుని వదిలేయడం అలవాటు చేసుకున్నాం’ అంటూ మరోసారి ఈ రూమర్స్‌కి చెక్ పెట్టారు ప్రభాస్.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/2L8Aq9N
v

No comments:

Post a Comment

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...