Tuesday, 13 August 2019

Anchor Suma: నా డ్రెస్ నా ఇష్టం.. సుమలా నేను కాదు.. నాలా సుమ ఉండొచ్చుగా: అనసూయ

తన వస్త్రధారణ, వ్యవహార శైలితో సోషల్ మీడియాలో హాట్ టాపిక్ అవుతూనే ఉంటుంది హాట్ యాంకర్ అనసూయ. బుల్లి తెరపై పొట్టి బట్టలేసి నెటిజన్లతో దారుణమైన ట్రోలింగ్స్ గురౌతున్న వీటిపై గట్టి కౌంటర్ ఇచ్చింది. తాను ఈ ట్రోలింగ్స్‌ని పట్టించుకోనని.. వాటిని పట్టించుకుని బాధపడ్డ సందర్భాలు చాలా ఉన్నాయని ఇప్పుడు వాటికి సిద్ధపడ్డా అంటూ గట్టి కౌంటర్ ఇచ్చింది అనసూయ. ఈ సందర్భంగా తన వస్త్రధారణపై అలా ఉండాలి ఇలా ఉండాలి అనే జడ్జ్ చేసే హక్కు లేదని నాకు నచ్చినట్టు నేను ఉంటా అంటూ కుండు బద్దులు కొట్టేసింది. ఈ సందర్భంగా తన తోటి యాంకర్ సుమపై ఆసక్తికరమైన కామెంట్స్ చేసింది. అనసూయ మాట్లాడుతూ.. ‘నా యాంకరింగ్ విషయానికి వస్తే.. , నేను, ఝాన్సీ అందరం పెళ్లైన వాళ్ళమే. వాళ్ల కంఫర్ట్ జోన్‌లో వాళ్లు వర్క్ చేసుకుంటున్నారు.. నా కంఫర్ట్ జోన్‌లో నేను వర్క్ చేసుకుంటున్నా. మేం అందరం వృత్తిని ప్రేమించేవాళ్లమే. అయితే వాళ్ల అనుభవం ముందు నేను ఎప్పుడూ తక్కువే. నేను ఎంత ఎదిగినా తక్కువగానే ఉంటాను. చాలా మంది వాళ్లతో నన్ను కంపేర్ చేస్తారు. సుమని చూసి నేర్చుకో.. అంటున్నారు. అలా ఎందుకు ఆలోచిస్తున్నారు. సుమ నన్ను చూసి నేర్చుకోవచ్చు కదా.. కాలాన్ని బట్టి ఎలా ఉండాలో. సో.. అలాంటి సలహాలు చెప్పకూడదు. నాతో పాటు యాంకరింగ్ చేస్తున్న పెళ్లి కాని అమ్మాయిలు ఎలా డ్రెస్ వేసుకున్నా వాళ్లకు అభ్యంతరం ఉండటం లేదు. కేవలం నన్ను మాత్రమే టార్గెట్ చేస్తున్నారు. ఎందుకు వాళ్లు నన్ను జడ్జ్ చేస్తున్నారు. వాళ్లు వీళ్లు చెప్పడం కాదు.. మనకి దృష్టి దోషం లేకుండా చూసుకుంటే మంచింది. లేదంటే ఇలాంటి మాటలు.. ట్రోలింగ్స్ వస్తుంటాయి’ అంటూ కుండబద్దలు కొట్టేసింది అనసూయ.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/2KHNWAN
v

No comments:

Post a Comment

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...