పవర్ స్టార్ పవన్ కళ్యాణ్.. ఈ పేరు ఉంటే రాజకీయ వర్గాల్లో డిఫరెంట్ వాయిస్ వినిపిస్తాయి కాని.. సినిమా వర్గాల్లోనూ ముఖ్యంగా ఆయన ఫ్యాన్స్‌లో పూనకాలే. అలాంటి పవన్ కళ్యాణ్ సినిమాలకు స్వస్తి చెప్పేసి ఫుల్ టైమ్ పొలిటికల్ లీడర్‌గా మారడంతో పవన్ వారసత్వాన్ని అందిపుచ్చుకునే ఆయన వారసుడు, రేణూ-పవన్‌ల కొడుకు అరంగేట్రం కోసం మెగా అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ సందర్భంలో పవన్ ఫ్యాన్స్‌లో ఉత్సాహం నింపే ఫొటోలను షేర్ చేశారు యంగ్ హీరో అడవి శేష్. ‘ఎవరు’ చిత్రంతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకుని మినిమమ్ గ్యారంటీ హీరోగా బ్రాండ్ క్రియేట్ చేసుకున్న అడవి శేష్.. జూనియర్ పవన్ అకీరానందన్‌తో పాటు పవన్ మాజీ భార్య రేణు, కూతురు ఆద్యలను కలిశారు. ఈ సందర్భంగా వారితో దిగిన ఫోటోలను షేర్ చేస్తూ ఇంట్రస్టింగ్ ట్వీట్ వదిలారు. ‘ఈరోజు హ్యాండ్సమ్ బాయ్ అకిరా నందన్ ఫ్యామిలీని కలిశా. ఆ కుటుంబంతో సరదాగా గడిపా. అకీరాకి ‘ఎవరు’ సినిమా చాలా బాగా నచ్చింది. మా ఇద్దరిలో చాలా విషయాలు కామన్‌గా ఉన్నాయి. మా ఇద్దరిదీ ఎడమ చేతి వాటం కావడం విశేషం. గంభీరమైన స్వరంతో 6.4 అడుగుల ఎత్తుతో అకీరా నందన్ చాలా హ్యాండ్సమ్‌గా ఉన్నాడు. వారితో కలిసి భోజనం చేసి, సరదాగా గడపడం చాలా ఆనందాన్ని ఇచ్చింది. చిట్టితల్లి ఆద్య (పవన్ కూతురు)కు కెమెరా అంటే కాస్త సిగ్గు అందుకే ఫొటోకి రాలేదు. రేణూదేశాయ్ మంచి రైటర్.. ఆమెను కలవడం హ్యాపీగా ఉంది’ అంటూ అకీరాతో సెల్ఫీలు దిగిన ఫొటోలను ట్విట్టర్ ద్వారా షేర్ చేశారు అడవి శేష్. ఇద్దరూ ఆరున్నర అడుగుల కటౌట్స్ కావడంతో అటు మెగా ఫ్యాన్స్.. ఇటు అడవి శేష్ ఫ్యాన్స్ తెగ షేర్ చేస్తూ జూనియర్ పవర్ స్టార్ అంటూ పొగడ్తల వర్షం కురిపిస్తుండటంతో ఈ ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.
from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/2ZwSaRc
v
No comments:
Post a Comment