Saturday, 17 August 2019

29 ఏళ్లయినా క్రేజ్ తగ్గని ‘జామురాతిరి జాబిలమ్మ’.. సరికొత్తగానూ అదిరింది..

‘క్షణ క్షణం’ సినిమా పేరు చెప్పగానే మనకు గుర్తొచ్చేది ఎంఎం కీరవాణి స్వరాలు సమకూర్చిన ‘జామురాతిరి జాబిలమ్మ..’ సాంగ్. రాంగోపాల్‌వర్మ దర్శకత్వంలో వచ్చిన ఆ మూవీలో వెంకటేష్, శ్రీదేవి జంటగా నటించి హిట్ అందుకున్నారు. అయితే మూవీలోని ఆ పాటను 1990 ఆగస్టు 13న రికార్డింగ్ చేశారు. ఈ ఆగస్టు 13న 29 ఏళ్లు పూర్తి చేసుకుని 30వ వసంతంలోకి అడుగుపెట్టింది. సింగర్స్ హేమచంద్ర, కాలభైరవ, మనీషా, దీపు, దామిని, మౌనిమ, శ్రుతి, నోయల్, పృథ్వీ చంద్ర ‘జామురాతిరి జాబిలమ్మ..’ పాటను మరోసారి మనకు కళ్లకు కట్టేలా తీసుకొచ్చారు. ఈ పాట సైతం ఎన్నిసార్లు విన్నా బోర్ కొట్టని తరహాలో మరోసారి మన ముందుకు తీసుకొచ్చారు. గతంలో వచ్చిన ఒరిజినల్ సాంగ్ రికార్డ్ సమయంలో ఈ సింగర్స్ కొందరు పుట్టకపోవడం గమనార్హం. అయినా ఆ మ్యూజికల్ హిట్ కోసం వారు చేసిన ప్రయత్నాన్ని వీక్షిద్దామా. ఈ యువ గాయనీగాయకులు చేసిన లేటెస్ట్ జామురాతిరి జాబిలమ్మ..’ నెటిజన్లను విపరీతంగా ఆకట్టుకుంటోంది. సోషల్ మీడియాలో సాంగ్ భారీ వ్యూస్‌తో వైరల్ అవుతోంది. తాజాగా వైరల్ అవుతున్న ‘జామురాతిరి జాబిలమ్మ..’ సాంగ్


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/2KCCQyk
v

No comments:

Post a Comment

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...