రాక్ స్టార్ తమ్ముడు ఘనంగా జరిగింది. సాగర్ తన చిన్న నాటి స్నేహితురాలు మౌనికను వివాహమాడిన విషయాన్ని ఆలస్యంగా సోషల్ మీడియా ద్వారా షేర్ చేశారు దేవి శ్రీ ప్రసాద్. జూన్ 19న తన తమ్ముడు మౌనికను వివాహమాడాడని.. ట్విట్టర్‌లో పెళ్లి ఫొటోలను షేర్ చేశారు దేవి శ్రీ ప్రసాద్. కాగా తన తల్లిదండ్రుల పెళ్లి రోజునాడే సాగర్-మౌనికల పెళ్లి జరగడం చాలా హ్యాపీగా ఉందంటూ ఆనందం వ్యక్తం చేశారు దేవి శ్రీ. ఎంతో ఘనంగా జరిగిన ఈ వివాహ వేడుకకు ఇండస్ట్రీ నుండి ఎవరూ హాజరుకాలేదు. రెండు కుటుంబాల సభ్యులు, బంధువులు, స్నేహితులు మాత్రమే హాజరయ్యారు. కాగా సాగర్... ఆర్య, నేను లోకల్, జనతా గ్యారేజ్, బొమ్మరిల్లు, జులాయి, డీజే లాంటి బ్లాక్ బస్టర్ హిట్ చిత్రాలకు పాటలు పాడారు సాగర్. ఈ మధ్యకాలంలో ఆయన డీజే చిత్రంలో పాడిన బాక్స్ బద్దలైపోద్ది సాంగ్ మ్యూజికల్ హిట్ అయ్యింది. ఆర్య సినిమాలో ‘నువ్వుంటే నిజమేగా సత్యం, వర్షం సినిమాలోని నీటి ముళ్లై నన్ను గిల్లు, ‘జనతా గ్యారేజ్’లో నేను పక్కా లోకల్ సాంగ్స్ పేరు తీసుకువచ్చాయి.
from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/2JBqTai
v
No comments:
Post a Comment