Sunday, 14 July 2019

Nithiin: 24 కిస్సెస్ కుమారికి నితిన్ బూస్టింగ్.. హే భీష్మ!

‘కుమారి 21 F’ చిత్రంతో నటిగా గుర్తింపు పొందిన .. ఇటీవల ‘24 కిస్సెస్’ అంటూ వెండితెరపై ముద్దుల జాతర చేసింది. ఆ చిత్రంతో బోల్డ్ నటిగా ముద్ర వేసుకున్న హెబ్బా పటేల్‌ ఎంత ఆరబోసినా ఆఫర్స్ మాత్రం వరించడం లేదు. ఈ తరుణంలో ఆమెకు బూస్టింగ్ ఇస్తూ.. ‘భీష్మ’ చిత్రంలో అవకాశం కల్పించారు యంగ్ హీరో . నితిన్, రష్మిక హీరో హీరోయిన్లుగా నటిస్తున్న ‘భీష్మ’ చిత్రం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటుంటోంది. సితార ఎంటర్‌టైన్‌మెంట్స్‌ పతాకంపై సూర్యదేవర నాగవంశీ నిర్మిస్తున్న ఈ చిత్రానికి ‘ఛలో’ ఫేమ్ వెంకీ కుడుముల దర్శకత్వం వహిస్తున్నారు. ప్రస్తుతం హైదరాబాద్‌లో షూటింగ్ జరుపుకుంటున్న ఈ చిత్రంలో ‘కుమారి’ హెబ్బా పటేల్ జాయిన్ అయినట్టుతెలుస్తోంది. ‘భీష్మ’ చిత్రంలో ప్రాధాన్యత ఉన్న పాత్రలో నటిస్తోందట హెబ్బా పటేల్. ఆమె కోసం ఓ ఐటమ్ సాంగ్‌ను కూడా రూపొందిస్తున్నాడట దర్శకుడు. అసలే ఆఫర్లు లేక ఫొటో షూట్‌లతో అలిసిపోతున్న హెబ్బాకు ‘భీష్మ’తో ఉపశమనం కలిగించాడట నితిన్. మరి ఈ సినిమాతో అయితే కుమారి బౌన్స్ బ్యాక్ అవుతుంతో లేదో చూడాలి. అన్నట్టు ఈ ముద్దుల సుందరి బిగ్ బాస్‌కి హౌస్‌కి వెళ్లబోతుందంటూ ప్రచారం నడుస్తోంది. బిగ్ బాస్ ఈనెల 21 నుండి ప్రారంభం కానుండటంతో హెబ్బా బిగ్ బాస్ హౌస్‌కి టాటా చెప్పేసినట్టే కనిపిస్తోంది. అసలు విషయం ఏంటన్నది మరో వారంలో తెలిసిపోనుంది.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/2lf7Vh8
v

No comments:

Post a Comment

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...