Monday, 22 July 2019

iSmart Shankar బుర్రలో పెట్టిన ‘చిప్’ నాది: కాపీ కొట్టేశారు: హీరో ఆకాష్ ఫైర్

ఏదైనా సినిమా హిట్ అయితే ఆ కథనాదే.. కాన్సెప్ట్ నాదే.. కాపీ కొట్టేశారు లాంటి ఆరోపణలు ఈ మధ్య కాలంలో తరచూ వినిపిస్తున్నాయి. చాలా ఏళ్ల తరువాత కొట్టక కొట్టక .. ‘ఇస్మార్ట్ శంకర్‌’తో ఓ హిట్ కొడితే.. ఆ కథ నాదే.. కాపీ కొట్టేశారంటూ హీరో ఆకాశ్ మీడియాకెక్కడం ఇండస్ట్రీ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది. ‘ఆనందం’ సినిమా హిట్ అందుకుని.. వరుస పరాజయాలతో స్క్రీన్‌పై కనిపించడమే మానేసిన ఆకాశ్.. హీరోనే కాకుండా స్క్రిప్ట్ రైటర్‌ కూడా. ఆయన మెదడులోనుండి వచ్చిన మెమొరీ ట్రాన్స్‌ఫర్ కథను పూరీ కాపీ కొట్టి... రామ్ బుర్రలో చిప్ పెట్టి హిట్ కొట్టారంటూ ఆరోపణలు చేశారు. ఒక వ్యక్తి మెమొరీని వేరొక వ్యక్తి మెమొరీలోకి పెట్టి నిజాన్ని రాబట్టడం అనే మూల కథతో ‘ఇస్మార్ట్ శంకర్’ కథను తీశారు పూరీ. అయితే ఇదే ఇతివృత్తంతో రాధ అనే మహిళా దర్శకురాలు ‘నాన్ యార్’ అనే చిత్రాన్ని తీసి తమిళ్‌లో విడుదల చేశారని.. అందులో నేనే హీరోగా నటించా అంటున్నారు ఆకాశ్. అక్కడ ఆ చిత్రానికి మంచి ఆదరణ లభించడంతో తెలుగులో 'కొత్తగా ఉన్నాడు' అనే పేరుతో విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తుండగా.. రీసెంట్‌గా విడుదలైన పూరీ జగన్నాథ్ ‘ఇస్మార్ట్ శంకర్’ తమకు పెద్ద షాక్ ఇచ్చిందంటున్నారు ఆకాష్. ఈ విషయమై పూరి జగన్నాధ్ ను సంప్రదించాలని ప్రయత్నించామని.. కానీ ఆయన అందుబాటులోకి రాకపోవడంతో తమిళ ప్రొడ్యూసర్ కౌన్సిల్‌లో ఫిర్యాదు చేసి.. సత్వర పరిష్కారం కోసం ఇక్కడ మీడియాను ఆశ్రయించామని ఆకాష్ తెలిపారు. తన వాదనను వినిపించే ఆధారాలను ఆకాష్ మీడియా ముందు ఉంచారు. సమస్య సామరస్యంగా పరిష్కారం కానీ పక్షంలో లీగల్‌గా ప్రొసీడ్ అయ్యేందుకు కూడా తానూ సిద్ధపడుతున్నట్లు ఆయన ప్రకటించారు. వాస్తవానికి కథ.. బ్రిటీష్ మూవీ నుండి కాపీ కొట్టారని.. క్రిమినల్ మూవీ నుండి లైన్ తీసుకుని కథ అల్లేశారని అనేక విమర్శలు వస్తుండగా.. కొత్తగా ఈ విమర్శల దాడిని హీరో ఆకాష్ ఒక్కసారిగా పెంచేశారు.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/32MI3e7
v

No comments:

Post a Comment

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...