Wednesday, 17 July 2019

Guna 369 ట్రైలర్: గుణ గుద్దితో గోడ ముక్కలు.. కార్తికేయ మాస్ కల్లాస్

‘మనిషి రూపం వేరు నిజ స్వరూపం వేరు’.. అంటూ మాస్ మసాలా లవ్ ఎంటర్‌టైనర్ ‘గుణ 369’ ట్రైలర్‌తో సందడి చేస్తున్నాడు RX 100 ఫేమ్ కార్తికేయ. ఇటీవల ‘హిప్పీ’ చిత్రంతో హిట్ కొట్టేందుకు వచ్చినప్పటికీ ఆ చిత్రం పప్పీ కావడంతో మళ్లీ ‘గుణ 369’ చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నారు కార్తికేయ గుమ్మకొండ. అర్జున్ జంధ్యాల ఈ చిత్రంతో దర్శకుడిగా పరిచయమవుతున్నారు. స్ప్రింట్ ఫిల్మ్స్, జ్ఞాపిక ఎంటర్‌టైన్మెంట్స్ పతాకాలపై అనిల్ కడియాల, తిరుమల్ రెడ్డి నిర్మిస్తున్నారు. చైతన్ భరద్వాజ్ సంగీతం సమకూరుస్తున్నారు. ఈ సినిమా ద్వారా అనఘ హీరోయిన్‌గా తెలుగు తెరకు పరిచయం అవుతున్నారు. ఇటీవల టీజర్‌ను విడుదల చేయగా.. తాజాగా బుధవారం నాడు ‘గుణ 369’ ట్రైలర్‌ను విడుదల చేసింది చిత్ర యూనిట్. ఇక ఈ ట్రైలర్ విషయానికి వస్తే.. కమర్షియల్ ఫార్ములాకి సెంటీమీటర్ దూరం కాకుండా రొటీన్‌గానే ఉంది ‘గుణ 369’. మొబైల్ షాప్‌లో హీరోయిన్‌ని చూసి తొలి చూపులోనే ప్రేమలోనే పడటం.. ఆ ప్రేమకు అడ్డంకులు ఏర్పడటం.. ఆ అడ్డంకుల్ని అధిగమించడానికి కత్తి పట్టి విలన్లను ఉతికి ఆరేయడం.. సింపుల్ ‘గుణ 369’ ట్రైలర్‌లో కనిపించే అంశాలివే. ట్రైలర్ ఫస్టాఫ్‌లో చాలా కూల్‌గా ఉన్న హీరో.. సెకండాఫ్ ఉగ్ర రూపం దాల్చడం.. కోడ్తె విలన్లు ఎగిరెగిరి పడటం.. గుద్దితే గోడలు ముక్కలైపోవడం.. అద్దాలు పగిలిపోవడం.. ఇలా మాస్ అవతార్‌ అనిపించుకునే అన్ని లక్షణాలతో కార్తికేయను ‘గుణ 369’ ట్రైలర్‌లో చూపించారు. చివర్లో ఖైదీ నెంబర్ 369గా జైలు నుండి విడుదలయ్యే సీన్‌‌తో ట్రైలర్‌ను ఎండ్ చేశారు. తాజా ట్రైలర్‌పై మీరూ ఓ లుక్కేయండి.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/2xPNOcm
v

No comments:

Post a Comment

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...