Wednesday, 17 July 2019

‘అలీకి టీటీడీలో మెంబర్‌షిప్ ఇస్తే తప్పేంటి’?

సినీ, రాజకీయ అంశాలపై విశ్లేషణలు అందించే మూవీ క్రిటిక్ మహేష్ కత్తి మరోమారు సోషల్ మీడియాలో వివాదాస్పద కామెంట్స్ చేశారు. ప్రముఖ కమెడియన్, వైసీపీ నాయకుడు అలీకి తిరుమల తిరుపతి దేవస్థానంలో మెంబర్ షిప్ రాబోతుందంటూ వస్తున్న వార్తలపై స్పందిస్తూ వాటిని సమర్ధించారు . ఈ సందర్భంగా.. ముస్లిం అయిన అలీకి తిరుమల తిరుపతి దేవస్థానంలో మెంబర్ షిప్ ఎలా ఇస్తారని కొంతమంది వ్యతిరేకిస్తున్న నేపథ్యంలో ఘాటుగా స్పందించారు కత్తి మహేష్. ఈ సందర్భంలో ఫేస్ బుక్‌లో అలీకి మద్దతును ప్రకటిస్తూ వివాదాస్పద కామెంట్స్ చేశారు. ‘‘నటుడు ఆలీకి కీలకపదవి.., టిటిడి బోర్డు మెంబర్ల కోసం మల్లగుల్లాలు’’.. పైవి రెండూ వేరువేరు వార్తలు. కానీ రెంటినీ కలిపి అలీకి హిందూదేవాలయమైన తిరుమల తిరుపతి దేవస్థానం నిర్వాహమండలిలో స్థానం ఎలా కల్పిస్తారు అని కొందరు అనవసరపు కాంట్రవర్సీ క్రియేట్ చేస్తున్నారు. అయినా అయ్యలూ! వేంకటేశ్వరుడు బీబీనాంచారమ్మని పెళ్లిచేసుకోగా లేనిది, ఆలీకి నిజంగానే తిరుమల తిరుపతి దేవస్థానంలో మెంబర్‌షిప్ ఇస్తే మాత్రం తప్పేంది? అంటూ తన అభిప్రాయాన్ని వ్యక్తపరిచారు కత్తి మహేష్.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/2xTUbLK
v

No comments:

Post a Comment

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...