Sunday, 14 July 2019

అల్లు అర్జున్‌కు స్వీట్ గిఫ్ట్ ఇచ్చిన కూతురు.. రాశీ ఖన్నా ఆశ్చర్యం!

ఎప్పుడూ సినిమాలతో బిజీగా ఉండే స్టైలిష్ స్టార్ కాస్త విరామం దొరికితే తన పిల్లలతోనే సమయాన్ని గడపడానికి ఇష్టపడతారు. కొడుకు అయాన్, కూతురు అర్హాతో సరదాగా ఆడుకుంటారు. సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్‌గా ఉండే బన్నీ.. తన పిల్లలతో సరదాగా గడిపిన సమయంలో తీసుకున్న ఫొటోలను అభిమానులతో పంచుకుంటూ ఉంటారు. తాజాగా అలాంటి ఫొటో ఒకదాన్ని అర్జున్ తన ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్ ద్వారా అభిమానులతో పంచుకున్నారు. తన తండ్రికి అర్హా ఒక బహుమతి ఇస్తోన్నట్లు ఉన్న ఫొటో అది. ‘చేతితో చేసిన కుండలో పువ్వులు పెట్టి దాన్ని నా స్వీట్‌హార్ట్ నాకు ఇచ్చింది’ అని ఇన్‌స్టాగ్రామ్ పోస్ట్‌లో బన్నీ పేర్కొన్నారు. ఫొటో చాలా బాగుంది. ఆ ఫొటోలో అర్హ, ఫ్లవర్ వాజ్, దాన్ని అందుకుంటోన్న బన్నీ చేయి మాత్రే కనిపిస్తున్నాయి. ఈ ఫొటోను చూసిన బన్నీ అభిమానులు ఎంత బాగుందో అంటూ మురిసిపోతున్నారు. కేవలం అభిమానులేనా.. హీరోయిన్ రాశీ ఖన్నా కూడా ఆశ్చర్యానికి గురయ్యారు. ‘హవ్ క్యూట్!!!’ అంటూ కామెంట్ పెట్టారు. కాగా, బన్నీ ప్రస్తుతం త్రివిక్రమ్ సినిమాతో బిజీగా ఉన్నారు. ఓవైపు షూటింగ్ చేస్తూనే మరోవైపు తన పాత్రకు డబ్బింగ్ చెప్పడం కూడా మొదలుపెట్టారు. ఈ సినిమాలో పూజా హెగ్డే హీరోయిన్. ఎస్.ఎస్.తమన్ సంగీతం సమకూరుస్తున్నారు. హారిక అండ్ హాసిని క్రియేషన్స్, గీతా ఆర్ట్స్ పతాకాలపై ఎస్.రాధాకృష్ణ, అల్లు అరవింద్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. పి.ఎస్.వినోద్ సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు. ఈ సినిమా తర్వాత సుకుమార్ దర్శకత్వంలో ఒక చిత్రం, వేణు శ్రీరామ్ దర్శకత్వంలో ‘ఐకాన్’ అనే సినిమాలో అల్లు అర్జున్ నటిస్తారు.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/2jORibT
v

No comments:

Post a Comment

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...