Monday, 1 July 2019

మహేష్ హీరోయిన్‌కి అరెస్ట్ వారెంట్!

మహేష్ హీరోయిన్ చిక్కుల్లో పడింది. చెక్ బౌన్స్ కేసులో కోర్టు నుండి సమన్లు జారీ అయ్యాయి. నాని, బద్రి, నరసింహుడు చిత్రాల్లో టాలీవుడ్ అగ్రహీరోలతో ఆడిపాడిన ఈ ముద్దుగుమ్మకు ఒకప్పుడు బాలీవుడ్‌లో మంచి క్రేజ్ ఉండేది. అయితే యంగ్ హీరోయిన్స్ పోటీ నుండి తట్టుకోలేక అడపాదడపా సినిమాలు చేస్తున్నా.. అమ్మడుకి అదృష్టం కలిసిరాకపోవడంతో ఫేడ్ అవుడ్ అయ్యే పరిస్థితికి వచ్చేసింది. ఈ తరుణంలో నిర్మాణ రంగంలోకి దిగిన అమిషాపటేల్‌కు అక్కడ కూడా కలిసి రావడం లేదు. ఇటీవల ఓ కొత్త సినిమా నిర్మాణం కోసం అజయ్ కుమార్ సింగ్ అనే ఫైనాన్షియర్ నుండి మూడు కోట్ల రూపాయలు అప్పుగా తీసుకుందట అమీషా. అయితే ఆ సినిమా ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ వల్ల మధ్యలోనే ఆగిపోవడంతో అజయ్ కుమార్ సింగ్‌కి రూ. 2.5 కోట్ల రూపాయిలు బాకీ పడింది. తన అప్పు చెల్లించాలని ఫైనాన్షియర్ అజయ్ కుమార్ సింగ్.. అమీషా పటేల్‌ని కోరడంతో కొంత మొత్తాన్ని చెక్ రూపంలో ఇచ్చింది. అయితే ఆ చెక్ కాస్తా బౌన్స్ కావడంతో కోర్టును ఆశ్రయించాడట అజయ్ కుమార్ సింగ్. దీంతో కోర్టు అమీషాపటేల్‌కి సమన్లు జారీ చేస్తూ.. జూలై 8న కోర్టుకు హాజరు కావాలని రాంచీ కోర్టు ఆదేశించారు. ఒకవేళ కోర్టుకు హాజరుకాని పక్షంలో అరెస్ట్ వారెంట్ జారీ అవకాశాలు ఉన్నాయి. ఒకవైపు సినిమాలు లేక ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్న నాటి స్టార్ హీరోయిన్‌ ఈ కోర్టు వ్యవహారం నుండి ఎలా బయటపడుతుందని బాలీవుడ్‌లో చర్చలు మొదలయ్యాయి. అయితే గతంలో కూడా అమీషాపటేల్‌పై పలు ఛీటింగ్ కేస్‌లు నమోదు అయ్యాయి. 2016లో ‘డ్రీమ్ విజ్డమ్’ అనే ఈవెంట్ మేనేజ్‌మెంట్ కంపెనీతో ఓ పెళ్లి వేడుకలో డాన్స్ చేస్తానని రూ. 11 లక్షలు డీల్ కుదుర్చుకుని.. చివర్లో ఎక్స్ ట్రా పేమెంట్ డిమాండ్ చేయడంతో ఆ వ్యవహారం కోర్టు వరకూ వెళ్లింది.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/2xu276d
v

No comments:

Post a Comment

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...