Tuesday, 9 July 2019

‘డియ‌ర్ కామ్రేడ్’ ట్రైల‌ర్.. రౌడీ ఫ్యాన్స్ గెట్ రెడీ!

‘డియర్ కామ్రేడ్’ సినిమా కోసం అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇప్పటికే విడుదలైన టీజర్, పాటలు సినిమాపై అంచనాలను భారీగా పెంచాయి. ఆ అంచనాలను రెట్టింపు చేయడానికి ఇప్పుడు చిత్ర ట్రైలర్ వచ్చేస్తోంది. తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ భాషల్లో ఏకకాలంలో తెరకెక్కుతోన్న ఈ చిత్ర ట్రైలర్‌ను ఈనెల 11న విడుదల చేస్తున్నారు. ఈ మేరకు విజయ్ దేవరకొండ ట్వీట్ చేశారు. ఈనెల 11న ఉదయం 11 గంటల 11 నిమిషాలకు ట్రైలర్‌ను అన్ని భాషల్లో ఒకేసారి విడుదల చేస్తున్నారు. కాగా, ఈ సినిమాలో విజయ్ దేవరకొండ సరసన హీరోయిన్‌గా నటించింది. భ‌ర‌త్ క‌మ్మ దర్శకత్వం వహించారు. జస్టిన్ ప్రభాకర్ సంగీతం సమకూరుస్తున్నారు. మైత్రీ మూవీమేక‌ర్స్, బిగ్ బెన్ సినిమాస్ ప‌తాకాల‌పై న‌వీన్ ఎర్నేని, య‌ల‌మంచిలి ర‌విశంక‌ర్‌, మోహ‌న్ చెరుకూరి(సి.వి.ఎం), య‌శ్ రంగినేని ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు తుది ద‌శ‌కు చేరుకున్నాయి. జూలై 26న ఈ చిత్రం విడుదలవుతోంది. ఇదిలా ఉంటే, ప్రస్తుతం క్రాంతి కుమార్ దర్శకత్వంలో విజయ్ దేరకొండ సినిమా చేస్తున్నారు. దీనికి ‘బ్రేకప్’ అనే టైటిల్‌ను పరిశీలిస్తు్న్నట్లు ఇప్పటికే వార్తలొచ్చాయి. ఇది కాకుండా ‘హీరో’ అనే బహుభాషా చిత్రాన్ని కూడా విజయ్ ప్రారంభించారు. ‘డియర్ కామ్రేడ్’ చిత్రాన్ని నిర్మించిన మైత్రీ మూవీ మేకర్స్ సంస్థే ఈ సినిమాను తెరకెక్కిస్తోంది. ఆనంద్ అన్నమలై దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రం ద్వారా మలయాళ నటి మాళవిక మోహనన్ హీరోయిన్‌గా తెలుగు తెరకు పరిచయమవుతున్నారు.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/30n2Cvl
v

No comments:

Post a Comment

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...