Monday, 8 July 2019

ఇన్‌స్టాగ్రామ్‌లో రామ్ చరణ్.. షాకైన అఖిల్ అక్కినేని!

టాలీవుడ్ హీరోహీరోయిన్లంతా ట్విట్టర్‌లో రోజుకో పోస్ట్ పెడుతూ ఉంటే మాత్రం దాని జోలికి రాలేదు. కేవలం ఫేస్‌బుక్‌లో మాత్రమే అప్పుడప్పుడు పోస్టులు పెడుతూ ఉంటారు. ఆ పోస్టులను చరణ్ భార్య ఉపాసన ట్విట్టర్ ద్వారా అభిమానులతో పంచుకుంటూ ఉంటారు. అది చూసి మెగా ఫ్యాన్స్ సంబరపడిపోతూ ఉంటారు. అయితే, ఇప్పటి వరకు ఫేస్‌బుక్‌కు మాత్రమే పరిమితమైన చరణ్.. ఇప్పుడు మరో సోషల్ ప్లాట్‌ఫాంకి ఎక్కారు. సెలబ్రిటీలు ఫొటోలను షేర్ చేసే ఇన్‌స్టాగ్రామ్‌లో చెర్రీ చేరారు. ఈ మేరకు సోమవారం తొలి పోస్ట్ పెట్టారు. ‘రంగస్థలం’ సినిమాలోని చిట్టిబాబు లుక్‌ను ప్రొఫైల్ పిక్చర్‌గా ఉంచారు. రామ్ చరణ్ ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్ క్రియేట్ చేయడంపై అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు, రామ్ చరణ్ ఇన్‌స్టాగ్రామ్‌లో చేరడంపై అక్కినేని యంగ్ హీరో అఖిల్ స్పందించారు. ‘వెల్‌కమ్ టు ఇన్‌స్టాగ్రామ్ ఆర్సీ!!!! దిస్ ఈజ్ ప్లెసెంట్ సర్‌ప్రైజ్’ అని కామెంట్ చేశారు. ఇదిలా ఉంటే, ఇన్‌స్టాగ్రామ్‌లో రామ్ చరణ్‌కు ఫాలోవర్ల సంఖ్య అప్పుడే 50వేలు దాటింది. ప్రస్తుతానికి రామ్ చరణ్‌ను ఫాలో అవుతోన్న సెలబ్రిటీల్లో సాయి ధరమ్ తేజ్, అఖిల్ అక్కినేని ఉన్నారు. కాగా, ప్రస్తుతం రామ్ చరణ్ ‘RRR’ షూటింగ్‌తో బిజీగా ఉన్నారు. రాజమౌళి అమెరికా వెళ్లడంతో షూటింగ్‌కు వారం రోజులు విరామం ఇచ్చారు. కొద్ది రోజుల్లో మళ్లీ చరణ్, ఎన్టీఆర్ షూటింగ్‌లో పాల్గొంటారు. ఈ సినిమాకు ఎస్.ఎస్.రాజమౌళి దర్శకత్వం వహిస్తోన్న సంగతి తెలిసిందే.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/2XxTBht
v

No comments:

Post a Comment

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...