Thursday, 4 July 2019

విలన్ అవతారమెత్తిన గాయకుడు రఘు కుంచె

యాంకర్‌గా, సింగర్‌గా, మ్యూజిక్ డైరెక్టర్‌గా ఇండస్ట్రీలో తనకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్న తనలోని మరో కోణాన్ని చూపించబోతున్నారు. ఫస్ట్ లుక్‌తోనే క్యూరీయాసిటీ క్రియేట్ చేసిన ‘‘పలాస 1978’’ మూవీలో రఘు కుంచె విలన్‌గా కనిపించబోతున్నారు. అది కూడా సాదా సీదా విలన్ పాత్ర కాదు. నాలుగు డిఫరెంట్ షేడ్స్‌లో.. పర్ఫార్మెన్స్‌కు బాగా స్కోప్ ఉన్న ఛాలెంజింగ్ పాత్ర చేస్తున్నారు. ‘‘పలాస 1978’’కు రఘు కుంచె మ్యూజిక్ కూడా కంపోజ్ చేస్తుండటం మరో విశేషం. ఆ మ్యూజిక్ సిట్టింగ్స్ సమయంలోనే డైరెక్టర్ కరుణ కుమార్‌కు రఘు విలన్‌గా కనిపించారు. అంతే ఆ పాత్రకు ఆయన్ని సెట్ చేసేశారు. నాలుగు విభిన్న వయసుల్లో రఘు కుంచె ఈ సినిమాలో కనిపించనున్నారు. 30, 40, 50, 70 సంవత్సరాల వయసులు కలిగిన వ్యక్తిగా రఘు కుంచె నటిస్తున్నారు. రియలిస్టిక్ క్రైమ్ డ్రామాగా తెరకెక్కుతున్న ‘‘పలాస 1978’’ చిత్రం ఇప్పటికే టాక్ ఆఫ్ ది టౌన్ అయ్యింది. పోస్ట్ ప్రొడక్షన్ దశలో ఉన్న ‘‘పలాస 1978’’ చిత్రాన్ని త్వరలోనే ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తామంటున్నారు దర్శక నిర్మాతలు. రక్షిత్, నక్షత్ర హీరో హీరోయిన్లుగా నటిస్తోన్న ఈ చిత్రంలో రఘు కుంచె, తిరువీర్, జనార్థన్, లక్ష్మణ్, శృతి, జగదీష్ ఇతర పాత్రల్లో నటిస్తున్నారు. తమ్మారెడ్డి భరద్వాజ సమర్పిస్తోన్న ఈ చిత్రానికి మాటలు: లక్ష్మీ భూపాల, పాటలు: భాస్కర భట్ల, సుద్దాల అశోక్ తేజ, ఎడిటర్: కోటగిరి వెంకటేశ్వరరావు, సినిమాటోగ్రఫీ: అరుల్ విన్సెంట్, సంగీతం: రఘు కుంచె, నిర్మాత: ధ్యాన్ అట్లూరి, రచన, దర్శకత్వం: కరుణ కుమార్.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/2xuTNU8
v

No comments:

Post a Comment

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...