Monday, 8 July 2019

సమంతకు అల్లు అర్జున్ స్వీట్ గిఫ్ట్.. సంబరపడిపోతోన్న ‘బేబీ’

అక్కినేనివారి కోడలు ప్రస్తుతం ‘ఓ! బేబీ’ సక్సెస్‌ను ఎంజాయ్ చేస్తున్నారు. సినిమా చూసినవాళ్లు ప్రశంసల వర్షం కురిపిస్తుంటే వాటిని ఆస్వాదిస్తూ సమంత పరవశించిపోతున్నారు. ప్రేక్షకులతో పాటు సినీ పరిశ్రమకు చెందిన ప్రముఖులు కూడా సమంతను పొగడ్తలతో ముంచెత్తుతున్నారు. సమంత కెరీర్ బెస్ట్ పెర్ఫార్మెన్స్ చేసిందంటూ కొనియాడుతున్నారు. ‘ఓ! బేబీ’లో సమంత నటన స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్‌ను కూడా కట్టిపడేసింది. ఈ సినిమా చూసిన ఆయన సమంతకు శుభాకాంక్షలు తెలుపుతూ గులాబీలతో కూడిన పుష్పగుచ్ఛం, ఒక మొక్కను బహుమతిగా పంపారు. బన్నీ గిఫ్ట్‌లకు ఫిదా అయిపోయిన సమంత ఈ విషయాన్ని ఇన్‌స్టాగ్రామ్ ద్వారా వెల్లడించారు. ఇన్‌స్టాగ్రామ్ స్టోరీలో బన్నీ ఇచ్చిన పుష్పగుచ్ఛం, మొక్క ఫొటోలను ఉంచారు. అల్లు అర్జున్‌కు కృతజ్ఞతలు తెలిపారు. వీరిద్దరూ కలిసి ‘సన్ ఆఫ్ సత్యమూర్తి’ సినిమాలో నటించిన సంగతి తెలిసిందే. వీరు జంటగా నటించిన సినిమా ఇదొక్కటే. కాగా, నాగచైతన్యను పెళ్లి చేసుకోవడానికి ముందు గ్లామర్ పాత్రలు కూడా చేసిన సమంత.. ప్రస్తుతం మాత్రం ప్రాధాన్యత ఉన్న పాత్రలే చేస్తున్నారు. వైవిధ్యాన్ని కోరుకుంటున్నారు. ‘రంగస్థలం’, ‘యూ టర్న్’, ‘సూపర్ డీలక్స్’, ‘మజిలీ’.. ఇప్పుడు ‘ఓ! బేబీ’ సినిమాలే దీనికి ఉదాహరణలు. ఇదిలా ఉంటే, తన మావయ్య కింగ్ నాగార్జున హీరోగా నటిస్తోన్న ‘మన్మథుడు 2’లో సమంత ఒక ప్రత్యేక పాత్ర చేస్తున్నారు. అలాగే, శర్వానంద్ హీరోగా తెరకెక్కుతోన్న ‘96’ రీమేక్‌లో హీరోయిన్ పాత్రలో నటిస్తున్నారు. తమిళంలో విజయ్ సేతుపతి సినిమాలో సమంత నటించబోతున్నారంటూ వార్తలు వస్తున్నాయి. దీనిపై ఇంకా స్పష్టత లేదు.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/2Xy00Oh
v

No comments:

Post a Comment

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...