Saturday, 6 July 2019

విప్లవ దర్శకుడుకి మాతృ వియోగం

ఎర్ర సినిమాల దర్శకుడిగా పేరొందిన ప్రముఖ విప్లవ దర్శకుడు తల్లి ధవళ సరస్వతి(86) శనివారం ఉదయం నర్సాపూర్‌లో కన్నుమూశారు. దర్శకుడు ధవళ సత్యం ఆమె పెద్ద కుమారుడు కాగా రెండవ కుమారుడు ధవళ చిన్నారావు చిత్ర పరిశ్రమలో ప్రొడక్షన్ ఎగ్జిక్యూటివ్‌గా,మూడవ కుమారుడు ధవళ మల్లిక్ దర్శకుడిగానూ చిత్ర పరిశ్రమలోనే స్థిరపడ్డారు. నాలుగవ కుమారుడు లక్ష్మీ నరసింహారావు నర్సాపూర్ కాలేజీలో తెలుగు హెడ్ ఆఫ్ ద డిపార్ట్మెంట్‌గా పనిచేస్తున్నారు. కాగా తమ తల్లి అంత్యక్రియలు ఈరోజు నర్సాపూర్‌లో నిర్వహించినట్టు ధవళ సత్యం తెలియజేసారు. ఎర్ర మల్లెలు, ఎర్ర మట్టి, చైతన్య రథం, యువతరం కదిలింది వంటి విప్లవ చిత్రాలతో ఆర్. నారాయణ మూర్తి, మురళీమోహన్, చిరంజీవిలతో పనిచేసిన ధవళ సత్యం ఇటీవల కాలంలో సినిమాలకు దూరంగా ఉంటున్నారు.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/30fR9h7
v

No comments:

Post a Comment

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...