Sunday, 14 July 2019

నాకొచ్చిన అనారోగ్యం చచ్చిపోయేంతది కాదు: పోసాని కృష్ణమురళి

ప్రముఖ నటుడు, రచయిత, దర్శకుడు ఆరోగ్య పరిస్థితిపై సోషల్ మీడియాలో వస్తోన్న వార్తల గురించి తెలిసిందే. అనారోగ్యం కారణంగా ఇటీవల హైదరాబాద్‌లోని యశోద ఆస్పత్రిలో చికిత్సపొందిన పోసాని మరోసారి తీవ్ర అస్వస్థతకు గురయ్యారని, ఆయన ఆరోగ్య పరిస్థితి ఆందోళనకరంగా ఉందని సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది. ఈ పుకార్లకు పోసాని పుల్‌స్టాప్ పెట్టారు. తన ఆరోగ్య పరిస్థితిని వివరిస్తూ ఒక వీడియో మెసేజ్‌ను విడుదల చేశారు. ‘అందరికీ నమస్కారం. కొన్నాళ్లుగా నా ఆరోగ్యం బాగాలేదని, విషమంగా ఉందని సోషల్ మీడియాలో వచ్చినట్టు మా ఫ్రెండ్స్ చెప్పారు. నిజమే నాకు అనారోగ్యం వచ్చింది. కానీ, చచ్చిపోయేంతదికాదు. చూస్తున్నారుగా.. మీ ముందు నేను మాట్లాడుతున్నాను. అనారోగ్యంతో యశోద ఆస్పత్రిలో చేరాను. డాక్టర్ ఎంవీ రావుగారు నన్ను బతికించారు. పరిపూర్ణమైన ఆరోగ్యవంతుడిని చేశారు. కాబట్టి, ఇక నా ఆరోగ్యం గురించి మీకు ఎలాంటి ఆలోచనలు వద్దు. వారం, పది రోజుల్లోనే మళ్లీ షూటింగ్‌కు వెళ్లబోతున్నాను.. తెరమీద మీకు కనిపించబోతున్నాను. ఇన్నాళ్లు నా ఆరోగ్యం గురించి కంగారు పడిన వాళ్లకి, నేను బాగుండాలని పూజించిన వాళ్లకి శతదా కృతజ్ఞతలు’ అని వీడియోలో పోసాని వెల్లడించారు.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/2jQ5BwG
v

No comments:

Post a Comment

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...