Tuesday, 9 July 2019

‘మిషన్ మంగళ్’ టీజర్.. ప్రభాస్‌కు అక్షయ్ పోటీ!

భారత అంతరిక్ష పరిశోధన కేంద్రం(ఇస్రో) చరిత్రలోనే ‘మిషన్ మంగళ్‌యాన్’ ఓ అద్భుత ఘట్టం. చైనా, జపాన్ దేశాలకు కూడా సాధ్యం కాని అంగారక యాత్రను భారత్ విజయవంతంగా పూర్తిచేసి కొత్త చరిత్రను లిఖించింది. ఈ మిషన్ వెనుక ఇస్రోకు చెందిన ఎంతోమంది శాస్త్రవేత్తల కష్టం ఉంది. మంగళ్‌యాన్ మిషన్‌ను తలపెట్టిన దగ్గర నుంచి ఇస్రో శాస్త్రవేత్తలు పడిన కష్టం, ప్రయోగ సమయంలో ఉన్న ఉత్కంఠ, మొత్తంగా ఈ ప్రయోగం వెనుక జరిగిన కథను దేశ ప్రజలకు తెలియజేయడం కోసం సినిమా రూపంలో ఇప్పుడు అందిస్తున్నారు. బాలీవుడ్ స్టార్ హీరో అక్షయ్ కుమార్ ప్రధాన పాత్రలో ఈ సినిమా తెరకెక్కుతోంది. ‘మిషన్ మంగళ్’ పేరిట వస్తోన్న ఈ సినిమాలో విద్యా బాలన్, తాప్సీ పన్ను, సోనాక్షి సిన్హా, శర్మన్ జోషి, కీర్తి కుల్హరి, నిత్య మీనన్, హె.ఆర్.దత్తాత్రేయ ముఖ్య పాత్రలు పోషించారు. వీరంతా ఇస్రో శాస్త్రవేత్తలుగా కనిపించనున్నారు. జగన్ శక్తి దర్శకత్వం వహించిన ఈ సినిమా స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా ఆగస్టు 15న ప్రేక్షకుల ముందుకు వస్తోంది. అయితే, చిత్ర ప్రచారంలో భాగంగా ‘మిషన్ మంగళ్’ టీజర్‌ను మంగళవారం విడుదల చేశారు. నింగిలోకి దూసుకెళ్లడానికి సిద్ధంగా ఉన్న మంగళయాన్ రాకెట్‌ కోసం లెక్కపెట్టే కౌంట్‌డౌన్‌తో ఈ టీజర్‌ను అద్భుతంగా కట్ చేశారు. 10 నుంచి 1 వరకు లెక్కించే సమయంలోనే పాత్రలన్నింటినీ పరిచయం చేసేశారు. ఈ ప్రాజెక్ట్‌కు నాయకత్వం వహించే శాస్త్రవేత్త రాకేశ్ ధావన్‌గా అక్షయ్ కుమార్ కనిపించారు. విద్యా బాలన్ సీనియర్ మోస్ట్ సైంటిస్ట్‌గా, దేవుడిని నమ్మే సాధారణ మహిళగా నటించారు. మొత్తం మీద టీజర్‌ను చూస్తుంటే సినిమాపై అంచనాలు పెరిగిపోతున్నాయి. అయితే, ఈ సినిమా విడుదలవుతోన్న ఆగస్టు 15నే ప్రభాస్ ‘సాహో’ కూడా వస్తోంది. దీంతో ఈ రెండింటి మధ్య విపరీతమైన పోటీ ఉంటుందని అప్పుడే సోషల్ మీడియాలో చర్చ మొదలైపోయింది. ప్రభాస్‌కు అక్షయ్ షాకివ్వడం ఖాయమని బాలీవుడ్ ఫ్యాన్స్ అంటుంటే.. అంతలేదని మన అభిమానులు అంటున్నారు.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/2XO71Kp
v

No comments:

Post a Comment

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...