Thursday, 4 July 2019

9 నెలల గర్భంతో సమీరారెడ్డి.. అండర్ వాటర్‌లో బికినీ షూట్

అమ్మతనంలో కమ్మదనాన్ని ఆస్వాదిస్తోంది నటి . ప్రస్తుతం 9 నెలల నిండు గర్భిణిగా ఉన్న సమీరా రెడ్డి.. మాతృత్వంలోని మాధుర్యాన్ని జీవితాంతం గుర్తుకుండేలా ప్రతిక్షణాన్ని పదిలపరుచుకుంటోంది. తన ప్రెగ్నెన్సీకి సంబంధించి ఎప్పటికప్పుడు నెటిజన్లకు టచ్‌లో ఉండే సమీరారెడ్డి.. 9 నెలల నిండు గర్భిణిగా బికినీతో నీటి అడుగున ఫొటో షూట్ నిర్వహించి సంచలనం సృష్టించారు. మాతృత్వం ఉన్న బ్యూటీని 9 నెలల గర్భిణిగా సెలబ్రేట్ చేసుకోవాలని ఉంది. ఇదో అందమైన అమూల్యమైన ఫీలింగ్ అంటూ అండర్ వాటర్‌లో బికినీ ధరించి బేబీ బంప్‌తో ఫొటోలకు పోజులు ఇచ్చింది సమీరారెడ్డి. మనం ఎప్పుడైతే జీవితంలో భయపడి, అలసిపోయి, ఎగ్జెట్ అవుతామో.. ఖచ్చితంగా అవి జ్ఞాపకాలుగా మిగిలిపోతాయి. వాటిని పదిలంగా దాచుకోవాలి. అందుకే ఈ ఫొటో షూట్ అంటూ 9 నెలల గర్భిణీగా నీటి అడుగున ధైర్యంగా బేబీ బంప్‌తో ఫొటో షూట్ నిర్వహించారు సమీరారెడ్డి. ప్రస్తుతం ఆమె ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసిన ఈ ఫొటోలు వైరల్ అవుతున్నాయి. నరసింహుడు, జై చిరంజీవ, అశోక్ తదితర తెలుగు చిత్రాల్లో నటించిన సమీరా రెడ్డి.. బాలీవుడ్, కోలీవుడ్, మాలీవుడ్‌లో పలు చిత్రాల్లో నటించింది. సినిమాలకు బ్రేక్ ఇచ్చిన సమీరారెడ్డి అక్షయ్ వర్దే అనే బిజినెస్ మ్యాన్‌ని వివాహం చేసుకుంది. వీరికి నాలుగేళ్ల కొడుకు ఉండగా.. రెండోసారి గర్భం దాల్చింది సమీరారెడ్డి.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/2XJRw5V
v

No comments:

Post a Comment

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...