Friday, 5 July 2019

బన్నీ కార్‌వాన్.. రూ.3.5 కోట్లతో కొనుగోలు చేసి.. అదిరిపోయేలా..

స్టయిలిష్ స్టార్ షూటింగ్ మధ్యలో విశ్రాంతి తీసుకోవడం కోసం ఓ కార్‌వాన్ కొనుగోలు చేశాడు. సకల సదుపాయాలతో లగ్జరీని ఒలకబోస్తున్న ఈ కార్‌వాన్‌ను ‘ఫాల్కన్’ అని పేరు పెట్టుకున్నాడు. ఫొటోలను షేర్ చేసిన బన్నీ.. ‘‘నా జీవితంలో పెద్దది ఏదైనా కొనుగోలు చేసిన ప్రతిసారీ.. నా మనసులో ఓ ఆలోచన మెదులుతుంది. మీ ప్రేమ వల్లే ఇది సాధ్యమైందనుకుంటా. అభిమానుల ప్రేమ బలమైంది. అందుకే నేను ఇవన్నీ కొనుగోలు చేయగలుగుతున్నా. థ్యాంక్యూ ఆల్. ఇదే నా వానిటీ వ్యాన్ ఫాల్కన్’’ అని అల్లు అర్జున్ ట్వీట్ చేశారు. బ్లాక్ కలర్‌లో ఉన్న ఫాల్కన్ లుక్ అదిరిపోయేలా ఉంది. రూ.3.5 కోట్లతో ఈ లగ్జరీ కార్‌వాన్‌ను కొనుగోలు చేసిన బన్నీ.. మరో మూడున్నర కోట్లు పెట్టి ముంబైకి చెందిన ఓ ఆటోమోటివ్ డిజైనర్‌తో తనకు అవసరమైనట్టుగా మార్పులు చేయించుకున్నాడట. లెదర్ సీట్లు, భారీ అద్దం, అద్భుతమైన లైటింగ్, ఎంటర్‌టైన్‌మెంట్ ఆప్షన్లతో ఈ వానిటీ వాన్ అద్భుతంగా ఉంది. ఈ కార్ వాన్‌పై అల్లు అర్జున్ సిగ్నేచర్ లోగో AAను బయట వైపు స్టైలిష్‌గా రాశారు. నాపేరు సూర్య, నా ఇల్లు ఇండియా సినిమా తర్వాత లాంగ్ గ్యాప్ తీసుకున్న బన్నీ.. ప్రస్తుతం త్రివిక్రమ్‌ శ్రీనివాస్‌ దర్శకత్వంలో నటిస్తున్నాడు. ఈ చిత్రంలో అల్లు అర్జున్ సరసన పూజా హెగ్డే హీరోయిన్‌గా నటిస్తోంది. సీనియర్ హీరోయిన్ ట‌బు, స‌త్య‌రాజ్ ముఖ్య పాత్ర‌ల్లో న‌టిస్తున్నారు.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/2L1DLtn
v

No comments:

Post a Comment

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...