Monday, 22 July 2019

యాక్షన్ థ్రిల్లర్ ‘22’.. వెంకటేష్, సాయిధరమ్ స్పెషల్ ఎట్రాక్షన్

దివంగత దర్శకురాలు బి.జయ తనయుడు శివకుమార్‌.బి దర్శకుడిగా పరిచయమవుతున్నారు. మా ఆయి ప్రొడక్షన్స్‌ పతాకంపై రూపేష్‌ కుమార్‌ చౌదరి, సలోని మిశ్రా హీరోహీరోయిన్లుగా రూపొందుతున్న యాక్షన్‌ థ్రిల్లర్ ‘22’కి శివకుమార్ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రం ప్రారంభోత్సవం ఈరోజు (జులై 22) రామానాయుడు స్టూడియోస్‌లో ఘనంగా జరిగింది. హీరోహీరోయిన్లపై విక్టరీ వెంకటేష్‌ క్లాప్‌ కొట్టగా, ప్రముఖ నిర్మాతలు బి.వి.ఎస్‌.ఎన్‌ ప్రసాద్‌, నవీన్‌ ఎర్నేని, కొండా కృష్ణం రాజు సంయుక్తంగా కెమెరా స్విచ్‌ ఆన్‌ చేసారు. ముహూర్తపు షాట్‌కు దర్శకుడు భీమినేని శ్రీనివాసరావు గౌరవ దర్శకత్వం వహించారు. డైరెక్టర్‌ హరీష్‌ శంకర్‌ చిత్ర దర్శకుడు శివకుమార్‌కి స్క్రిప్ట్‌ అందించి ఆల్‌ ది బెస్ట్‌ చెప్పారు. ఈ చిత్ర పూజా కార్యక్రమాలను దర్శకుడు కె.ఎస్‌. రవీంద్ర (బాబీ) నిర్వహించారు. విశిష్ట అతిథిగా సుప్రీమ్‌ హీరో సాయిధరమ్ తేజ్‌ హాజరయ్యారు. అలాగే, ఈ కార్యక్రమంలో సి.అశ్వనీదత్‌, కె.ఎస్‌. రామారావు, యం.యస్‌.రాజు, అనీల్‌ సుంకర, శ్యామ్‌ప్రసాద్‌ రెడ్డి, జెమిని కిరణ్‌, ఎస్‌.వి. కృష్ణారెడ్డి, అచ్చిరెడ్డి, కె.కె. రాధామోహన్‌, సముద్ర, నిమ్మకాయల ప్రసాద్‌, చిట్టూరి శ్రీనివాసరావు, సాగర్‌ తదితర సినీ ప్రముఖులు హాజరై దర్శక నిర్మాతలకి, చిత్ర యూనిట్‌కి శుభాకాంక్షలు తెలిపారు. ఇటీవలి కాలంలో చిన్న సినిమాకి ఇంతమంది అతిథులు హాజరై శుభాకాంక్షలు తెలపడం ఇదే తొలిసారి. ఈ సందర్భంగా దర్శకుడు శివకుమార్ బి మాట్లాడుతూ.. ‘‘నేను దర్శకుడిగా పరిచయమవుతోన్న తొలి చిత్రానికి గారు క్లాప్ నివ్వడం చాలా సంతోషంగా ఉంది. అలాగే నేను అసిస్టెంట్ డైరెక్టర్‌గా సాయి తేజ్ గారి రెండు సినిమాలకు పని చేశాను. ఆయన ఈ కార్యక్రమానికి రావడం హ్యాపీగా ఉంది. నేను మారుతి, పూరి జగన్నాథ్‌, వి.వి.వినాయక్‌ వద్ద వర్క్‌ చేశాను. ఆ ముగ్గురి స్ఫూర్తి వల్లే ఈరోజు నేను మీ ముందున్నాను. ఈ సినిమాలో బిగ్‌ బాస్‌ ఫేం పూజా రామచంద్రన్‌ ఒక క్రూషియల్‌ క్యారెక్టర్‌ చేస్తుంది. ఈ సినిమాకి సాయి కార్తీక్‌ సంగీతం అందిస్తున్నారు’’ అని చెప్పారు. అలాగే ‘బాహుబలి’, ‘ఖైదీ నెం 150’, ‘సాహో’ చిత్రాలకి వర్క్‌ చేసిన జాషువా యాక్షన్‌ సీక్వెన్స్‌ తమ చిత్రానికి హైలైట్స్‌గా నిలుస్తాయని శివకుమార్ వెల్లడించారు. ‘‘నాకు బిగ్గెస్ట్‌ స్ట్రెంగ్త్‌ ఎవరంటే మా అమ్మ జయ. మా అమ్మ దగ్గర ప్రొడక్షన్‌తో పాటు దర్శకత్వ శాఖలో మెళకువలు నేర్చుకున్నాను. ఆవిడ ఎక్కడ ఉన్నా ఇవన్నీ చూసి ఆనందిస్తారనుకుంటున్నాను. అలాగే మా నాన్న బి.ఎ. రాజు గారు ఎప్పుడూ నన్ను ఎంకరేజ్ చేస్తూ సపోర్ట్ చేస్తున్నారు. ఈ సినిమా టైటిల్‌ ‘22’ అనేది ఒక నెంబర్‌. ఆ నెంబర్‌కి ఒక కీ ట్విస్ట్‌ ఉంది. అది రివీల్‌ చేస్తే కిక్‌ ఉండదు. మర్డర్‌ మిస్టరీతో మిక్స్‌ అయిన కంప్లీట్‌ యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌. ఈనెల 29 నుండి రెగ్యులర్‌ షూటింగ్‌ జరుగుతుంది’’ అని చెప్పారు. కాగా, ఈ చిత్రంలో విక్రమ్‌జీత్‌, జయప్రకాష్‌, రాజేశ్వరి నాయర్‌, రవి వర్మ, ఫిదా శరణ్య, రాంబాబు వర్మ లంకా, మాస్టర్‌ తరుణ్‌ పవార్‌, బేబి ఓజల్‌ పవార్‌ తదితరులు నటిస్తున్నారు. ఈ చిత్రానికి సినిమాటోగ్రఫీ: బి.వి. రవికిరణ్‌, సంగీతం: సాయి కార్తీక్‌, ఎడిటింగ్‌: శ్యామ్‌ వాడవల్లి, ఆర్ట్‌: అడ్డాల రాజు, యాక్షన్‌: స్టంట్‌ జాషువా, మేకప్‌: బాలు డెక్కా, కాస్ట్యూమ్స్‌: నరసింహారావు, స్టిల్స్‌: వరహాల మూర్తి, చీఫ్‌ కో-డైరెక్టర్‌: పుల్లారావు కొప్పినీడి, ప్రొడక్షన్‌ హెడ్‌ అండ్‌ కొరియోగ్రఫీ: ఆనీ లామా, నిర్మాత: సుశీలా దేవి, కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: శివకుమార్‌ బి.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/2ycXmi9
v

No comments:

Post a Comment

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...