Tuesday, 25 June 2019

Oh Baby ఏంటీ అందం.. సమంత ఫొటోకి రాశీ ఖన్నా ఫిదా

అటాలీవుడ్‌లో విపరీతమైన క్రేజ్ ఉన్న హీరోయిన్లలో అక్కినేని ముందు వరుసలో ఉంటారు. ఆమె ఏం చేసినా వైరలే. ఒకవైపు సినిమాలు చేస్తూనే మరోవైపు వాణిజ్య ప్రకటనల్లోనూ ఆమె నటిస్తున్నారు. ఎప్పుడూ సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉండే సమంత.. కాస్ట్యూమ్, జ్యుయలరీ కంపెనీలకు కూడా ప్రచారం కల్పిస్తున్నారు. దీనిలో భాగంగా తీసుకున్న ఫొటోసూట్‌లను ఇన్‌స్టాగ్రామ్‌లో పెడుతున్నారు. సమంత ఇన్‌స్టాగ్రామ్ ఫొటోలకు ప్రత్యేకంగా ఫ్యాన్ ఫాలోయింగ్ ఉందంటే అతిశయోక్తి కాదు. తాజాగా ఇన్‌స్టాగ్రామ్‌లో సమంత మూడు ఫొటోలు పోస్ట్ చేశారు. ఈ ఫొటోల్లో సమంత చాలా అందంగా ఉన్నారు. కాస్ట్యూమ్ డిజైనర్ క్రెషా బజాజ్ కలెక్షన్స్‌ను ప్రచారం చేయడంలో భాగంగా సమంత ఈ ఫొటోషూట్ చేశారు. క్రెషా బజాజ్ డిజైన్ చేసిన డ్రెస్, వన్రజవేరి జ్యుయలరీతో సమంత ఫొటోలకు పోజులిచ్చారు. రోహన్ శ్రేష్ఠ ఈ ఫొటోలను తీశారు. కాగా, ఈ ఫొటోలకు సమంత అభిమానులు ఫిదా అయిపోతున్నారు. కేవలం సమంత ఫ్యాన్స్ మాత్రమే కాదు.. తోటి హీరోయిన్లు కూడా ఏంటీ అందం అంటూ కొనియాడుతున్నారు. ముఖ్యంగా రాశీ ఖన్నా ‘సో ప్రెట్టీ’ అని కామెంట్ పెట్టారు. అలాగే హన్సిక ఎమోజీతో తన ప్రేమను తెలియజేశారు. ఇదిలా ఉంటే, సమంత ప్రధాన పాత్రలో నటించిన ‘ఓ బేబీ’ చిత్రం జూలై 5న ప్రేక్షకుల ముందుకు వస్తోంది. ఈ సినిమాపై ప్రేక్షకుల భారీ అంచనాలున్నాయి. కొరియన్ మూవీ ‘మిస్ గ్రానీ’కి ఇది రీమేక్. బీవీ నందినీరెడ్డి దర్శకత్వం వహించారు.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu http://bit.ly/2ZU5ccj
v

No comments:

Post a Comment

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...