Thursday, 20 June 2019

Oh Baby: ‘ఓ బేబీ’ పక్కా ఫ్లాప్ అన్నందుకు.. అతడ్ని వెధవ అనేసిన సమంత

అక్కినేని కోడలు మంచి నటి మాత్రమే కాదు.. అంతకు మించిన మాటకారి అని మరోసారి నిరూపించుకుంది. సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉండే సమంత.. ఎప్పటికప్పుడు తన సినిమా విశేషాలతో పాటు పర్సనల్ విషయాలను షేర్ చూసుకుంటూ వాళ్లతో ముచ్చటిస్తూ ఉంటుంది. అయితే సరదా ప్రశ్నలకు సరదాగానే ఆన్సర్ చెప్పే సమంత.. ఛాన్స్ దొరికింది కదా అని శృతి మంచి కామెంట్స్ చేస్తే అదే రేంజ్‌లో కౌంటర్లు కూడా ఇచ్చేస్తుంటుంది. తాజాగా ఓ నెటిజన్ శాపనార్థాలకు నవ్వుతూనే దిమ్మతిరిగే ఆన్సర్ ఇచ్చింది. ఆ వివరాల్లోకి వెళ్తే.. ప్రస్తుతం వరుస బ్లాక్ బస్టర్ హిట్లతో దూసుకుపోతున్న సమంత ‘ఓ బేబీ’ అనే ప్రయోగాత్మక చిత్రంలో నటించారు. నందిని రెడ్డి దర్శకత్వం వహించిన ఈ చిత్రం జూలై 5న ప్రేక్షకుల ముందుకు రానుంది. ‘మిస్ గ్రానీ’ అనే కొరియా మూవీని ‘ఓబేబీ’ పేరుతో రీమేక్ చేస్తున్నారు. ఇందులో సమంత 23 ఏళ్ల అమ్మాయిగా కనిపిస్తూనే.. 70 ఏళ్ల పెద్దావిడ భావాలను కలిగిఉంటే డిఫరెంట్‌ రోల్‌ను పోషిస్తుంది. ఇక తెలుగుతో పాటు తమిళ్‌లోనూ మంచి మార్కెట్ ఉన్న సమంత లేటెస్ట్ మూవీ ‘ఓ బేబీ’ని తమిళ్‌లోనూ విడుదల చేస్తున్నారు. ఈ మూవీ ప్రమోషన్స్‌లో భాగంగా.. ఈ చిత్రంలో తన పాత్రకు డబ్బింగ్ చెప్పిన చిన్మయి గురించి ప్రస్తావిస్తూ ఓ వీడియోను విడుదల చేశారు సమంత. ఈ వీడియోలో చిన్మయితో పాటు సమంత, నందినీ రెడ్డిలు ఉన్నారు. ఈ ప్రమోషన్ వీడియోకు నెటిజన్ల నుండి మంచి స్పందన రాగా.. ఓ నెటిజన్ భిన్నంగా స్పందించాడు. ఫెమినిస్ట్‌లు అంతా ఒకే దగ్గర ఉన్నారుగా.. ‘ఓ బేబీ’ మూవీ పక్కా ఫ్లాప్’ అంటూ కామెంట్ చేశారు. దీనిపై స్పందించిన సమంత.. ‘హ.. హ.. థాంక్యూ!! వరల్డ్ మీట్ ఇడియట్, ఇడియట్ మీట్ వరల్డ్’ (ప్రపంచం వెధవల దగ్గరకు వెళ్లాల్సిన అవసరం లేదు.. వెధవలే ప్రపంచం దగ్గరకు వస్తారు) అంటూ నవ్వుతూనే ఘాటుగా స్పందించారు సమంత.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu http://bit.ly/2WRbNSN
v

No comments:

Post a Comment

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...