Saturday, 22 June 2019

విదేశాలకెళ్తే వెన్నుపోటు ‘బ్రహ్మానందం’.. నాడు ఎన్టీఆర్ నేడు బాబు: వర్మ పంచ్

‘లక్ష్మీస్ ఎన్టీఆర్’ చిత్రాన్ని ఏపీలో విడుదల కాకుండా అడ్డుకున్న నాటి ముఖ్యమంత్రి నాయుడుపై వర్మకు ఇంకా కోపం తగ్గినట్టు లేదు. ఎన్నికల సందర్భంగా చంద్రబాబుని టార్గెట్ చేస్తూ అనేక వివాదాస్పద పోస్ట్‌లు, సెటైర్‌లు కురిపించిన వర్మ.. మరోసారి ప్రతిపక్షనేత చంద్రబాబుని టార్గెట్ చేసి ట్విట్టర్‌ని హీటెక్కిస్తున్నారు. తాజాగా టీడీపీకి చెందిన నలుగురు రాజ్యసభ సభ్యులు సీఎం రమేష్, సుజనా చౌదరి, టీజీ వెంకటేష్, గరికపాటి రామ్మోహన్‌రావు నలుగురు బీజేపీ తీర్ధం పుచ్చుకుని చంద్రబాబుకి షాక్ ఇచ్చారు. రాజ్యసభలోని తెలుగుదేశం లెజిస్లేచర్ పార్టీని బీజేపీలో విలీనం చేయాలని కోరుతూ ఈ నలుగురు ఎంపీలు రాజ్యసభ ఛైర్మన్ వెంకయ్య నాయుడును కోరిన విషయం తెలిసిందే. చంద్రబాబు విదేశీ పర్యటనలో ఉండటంతో టైం చూసుకుని టీడీపీని కోలుకోలేని దెబ్బ కొట్టారు ఈ నలుగురు జంప్ జిలానీలు. అయితే ఒక్కసారి చరిత్రలోకి వెళ్తే.. నాడు నాదెండ్ల భాస్కర్ రావు.. టీడీపీ వ్యవస్థాపకుడు నాటి ముఖ్యమంత్రి ఎన్టీఆర్‌‌ విదేశాల్లో ఉండగా.. ఇదే తరహాలో నమ్మించి వెన్నుపోటు పొడిచారని ఇప్పుడు అదే.. సీన్ రిపీట్ అయ్యిందంటూ ఎద్దేవా చేశారు . అసెంబ్లీలో బాబు మాట్లాడుతుంటే జగన్ కంటిన్యూగా నవ్వుతూ ఉండటాన్ని చూస్తుంటే చాలా ఆనందంగా ఉంది.. చంద్రబాబు బ్రహ్మానందంగా మారారనిపిస్తుంది’ అంటూ సెటైర్లు కురిపించారు వర్మ.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu http://bit.ly/2FqsEWL
v

No comments:

Post a Comment

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...