Friday, 21 June 2019

Allu Bobby: అల్లు అరవింద్ పెద్ద కుమారుడి వివాహం.. యోగా ట్రైనర్‌ను పెళ్లాడిన బాబీ

ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ పెద్ద కుమారుడు అల్లు బాబీ పెళ్లి చేసుకున్నారు. నీలు షా అనే యోగా ట్రైనర్‌ను ఆయన వివాహం చేసుకున్నారు. వీరి పెళ్లి ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అల్లు బాబీకి ఇది రెండో పెళ్లి. దీంతో కుటుంబ సభ్యుల మధ్య నిరాడంబరంగా వివాహం జరిగినట్టు తెలుస్తోంది. బయటకు వచ్చిన ఫొటోల్లో చిరంజీవి భార్య సురేఖ కనిపించగా.. అల్లు అర్జున్ మాత్రం కనిపించలేదు. దీంతో త్రివిక్రమ్ సినిమాలో బిజీగా ఉన్న బన్నీ.. అన్నయ్య వివాహ వేడుకకు హాజరు కాలేదని భావిస్తున్నారు. బాబీ పెళ్లాడిన నీలా షా ముంబై అమ్మాయి. పుణేలోని సింబయాసిస్ యూనివర్సిటీ నుంచి ఎంబీఏ పూర్తి చేసిన ఆమె.. తన సోదరితో కలిసి యోగా డెస్టినేషన్ పేరిట యోగా శిక్షణ కేంద్రాన్ని నడుపుతున్నారు. ముంబైలో పుట్టిన నీలు ప్రస్తుతం హైదరాబాద్‌లో సెటిలయ్యారు. వీరి ప్రేమ వివాహం అని తెలుస్తోంది. అల్లు బాబీ మీడియాలో ఫోకస్ కావడానికి అంతగా ఇష్టపడరు. దీంతో చాలా మంది అల్లు అరవింద్‌కు ఇద్దరు కుమారులని మాత్రమే భావిస్తుంటారు. ఇండస్ట్రీలో ఉన్నవారికి మాత్రమే బాబీ గురించి తెలుసు. బాబీ కొన్నేళ్ల క్రితం మొదటి భార్యతో విడిపోయారు. ఆయనకు ఓ కుమార్తె కూడా ఉన్నారు. బాబీ రెండో పెళ్లి విషయమై మీడియాలో కథనాలు వస్తున్నప్పటికీ.. అల్లు కాంపౌండ్ మాత్రం ఇప్పటి వరకు స్పందించలేదు.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu http://bit.ly/2Fq784f
v

No comments:

Post a Comment

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...