Saturday, 9 May 2020

మే 9.. టాలీవుడ్‌కి ఈ తేదీ ఎందుకంత స్పెషల్

టాలీవుడ్‌లో సెంటిమెంట్స్‌కి కాస్త చోటు ఎక్కువే. వాటి పరిణామాలు కూడా అలానే ఉంటాయి. అందుకే కోట్లు ఖర్చు చేసి సినిమాలు తీసే ప్రొడ్యూసర్స్ నుండి అందరూ వాటిని బాగా నమ్ముతారు. అలా టాలీవుడ్‌కి సెంటిమెంట్‌గా మారిన డేట్ మే 9. మంటెత్తిపోయే ఈ సమ్మర్ టైమ్‌లో వచ్చిన చాలా సినిమాలు ప్రేక్షకులకు మంచి అనుభూతి కలిగించి భారీ బ్లాక్ బస్టర్స్‌గా నిలవడం అనేది ఈ డేట్ స్పెషాలిటీ. ఈ తేదీకి విడుదల అయిన చాలా సినిమాలు ఇండస్ట్రీ హిట్స్‌గా నిలిచాయి. ‘జగదేక వీరుడు అతిలోక సుందరి’.. ఈ సినిమా గురించి తెలియని తెలుగు ప్రేక్షకుడు ఉన్నాడు అంటే మాత్రం అది అతిశయోక్తి అవుతుంది. అలాంటి ఈ ఎవర్ గ్రీన్ సినిమా పేక్షకుల ముందుకు వచ్చింది ఈ రోజునే. ఆ సినిమా గురించి 30 ఏళ్ళ తరువాత కూడా మాట్లాడుకుంటున్నారు అంటే అది ఎలాంటి విజయం సాధించింది అనేది అర్థం చేసుకోవచ్చు. ఇక మెగాస్టార్ కెరీర్‌లో మరొక బ్లాక్ బస్టర్ ‘గ్యాంగ్ లీడర్’ ఆ మరుసటి ఏడాది అదే రోజు రిలీజ్ అయ్యి చిరంజీవి ఇమేజ్‌ని వేరే స్థాయికి తీసుకెళ్లింది. Also Read: విక్టరీ వెంకటేష్ నటించిన ‘ప్రేమించుకుందాం రా!’ కూడా మే 9న విడుదలైన మరొక ఇండస్ట్రీ హిట్. ఈ సినిమా అప్పటి వరకు వెంకటేష్ కెరీర్‌లోనే బిగ్గెస్ట్ హిట్. ‘జగదేక వీరుడు అతిలోక సుందరి’ సినిమాతో ఈ మే 9 సెంటిమెంట్‌కి శ్రీకారం చుట్టిన వైజయంతీ మూవీస్.. కష్టాలను తీర్చి, సంస్థకు పూర్వ వైభవం తీసుకొచ్చిన ‘మహానటి’ని కూడా రెండేళ్ల క్రితం మే 9న విడుదల చేసింది. వైజయంతీ సంస్థ ద్వారానే హీరోగా పరిచయమైన మహేష్ బాబు రీసెంట్‌గా ఆ బ్యానర్‌లో నటించిన సినిమా ‘మహర్షి’. ఆ సినిమా కూడా రిలీజ్‌కి ముందు అనేక వాయిదాలు పడి గత సంవత్సరం మే 9న విడుదలైంది. టాక్ ఎలా ఉన్నా ‘మహర్షి’ సినిమా మాత్రం మహేష్ బాబు కెరీర్‌లోనే హయ్యెస్ట్ గ్రాసర్‌గా నిలిచింది. ఆ సినిమా విజయంతో మహేష్ బాబు టాప్ రేస్‌లో మరింత ముందుకు దూసుకెళ్లారు. ఇలా మే 9 తెలుగు చలనచిత్ర పరిశ్రమకు మంచి హిట్స్ అందించే తేదీగా ఫిక్స్ అయిపోయింది. ఇక వైజయంతీ మూవీస్ సంస్థకు అయితే ఆ తేదీ మరింత ప్రత్యేకం.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/2YNgPUX
v

No comments:

Post a Comment

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...